ఎంటర్టైన్మెంట్

షూటింగ్ మధ్యలో అఖిల్ తలకు గాయం, దీంతో నాగార్జున వచ్చి ఏం చేసాడో తెలుసా..?

అఖిల్ కు కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు చిత్ర షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అఖిల్ కి తీవ్ర గాయాలేమి కాలేదని ఈనెల 10 నుండి తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దాంతో షూటింగ్ వాయిదా పడిందన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అయితే అక్కినేని నటవారసుడు అఖిల్.. హీరోగా నిలదొక్కుకోవడానికి పడుతున్న తంటాలు అంతా ఇంతా కాదు. పోనీ బావుండడా అంటే.. హాలీవుడ్ రేంజ్ కటౌట్, యాక్టింగ్ రాదా అంటే? ఇరగదీసేస్తాడు. పోనీ డ్యాన్స్‌లు, ఫైట్స్ గట్రా చేయడా అంటే? కుమ్మేస్తాడు.

మరేంటి ప్రాబ్లమ్ అంటే.. అది మాత్రం తెలియదు. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే.. అఖిల్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన సిసింద్రి సినిమా.. అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ఈ సినిమాలో అఖిల్‌ను చూసి ఫిదా అవని ఆడియెన్ ఉండడు. అంత క్యూట్‌గా ఉంటాడు. కాగా ఈ సినిమాలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి డైరెక్టర్ శివ నాగేశ్వరరావు ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చాడు. సిసింద్రి సినిమా షూటింగ్ టైమ్‌లో అఖిల్ అడుకుంటూ ఉండగా.. సడెన్‌గా కింద పడిపోయాడట. అప్పుడు అఖిల్ కేర్ టేకర్ మాత్రమే ఉందట.

దాంతో నాగార్జునకు అఖిల్ పడ్డాడని ఫోన్ వెళ్లిందట. ఇక అప్పుడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నాగ్ హుటాహుటిన బయల్దేరిపోయాడట. మరోవైపు అమల సైతం తన ఇంటి నుంచి కంగారుగా వచ్చేసిందిట. ఈ లోపు చిత్ర యూనిట్‌కు నాగేశ్వరరావు.. నాగార్జున గారు ఇప్పుడొచ్చి కొడతారు.. పడండి. పారిపోవడాలు మాత్రం అస్సలు చేయకండి అని చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఓ వైపు కోపంతో, మరోవైపు టెన్షన్‌లో నాగార్జున వచ్చి అఖిల్‌ను ఎత్తుకున్నాడట. అయితే అఖిల్‌కు పెద్దగా దెబ్బలు తగల్లేదట.

తల, కంటి మధ్యలో చిన్న గీత పడిందని, రక్తం కూడా కారలేదని నాగేశ్వరారు చెప్పాడు. ఇక నాగార్జునతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ సతీష్.. నాగార్జునను కూల్ చేశాడట. అలా సెట్‌లో ఉన్న వాళ్లు ఊపిరి పీల్చుకున్నారని నాగేశ్వరావు చెప్పుకొచ్చాడు. 1995లో రిలీజైన ఈ సినిమాను నాగార్జుననే ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాను అమెరికన్ ఫిల్మ్ బేబీస్ డే అవుట్ నుంచి ఇన్‌స్పైర్ అయి తీశారు. శరత్ బాబు, ఆమని, సుధాకర్, తనికెళ్లభరణి, గిరిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *