తాజా వార్తలు

ఐఏఎస్‌ల పుష్పగుచ్ఛాన్ని స్వీకరించేందుకు చంద్రబాబు నిరాకరించారు, ఎందుకో తెలుసా..?

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు. ఈ రోజు తొలిసారి టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. పాలన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా.. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సమయం ఇవ్వాలనుకుంటున్నారు. అయితే నిన్న సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ఆ సమయంలో చాలామంది అధికారులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పూల బొకేలతో ఎదురెళ్లి చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఎక్కువ హడావుడి చేస్తున్న వారిలో జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులే ఎక్కువగా కనిపించారు.

బొకేలు పట్టుకొని తమకు చంద్రబాబు అంటే ఎంతో గౌరవం అన్నట్లుగా వ్యవహరించారు. వారి తీరు చూసి తోటి అధికారులే ఆశ్చర్యపోయారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆయన చుట్టూ తిరిగి.. ఆయన కోరిక మేరకు చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను, టిడిపి నేతలను నానా హింసలు పెట్టారు. అనేకమంది చనిపోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు ఏమీ తెలియదు అన్నట్టుగా చంద్రబాబు దగ్గరకు వెళ్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గుర్తున్నారు కదా. జగన్ అక్రమాస్తుల కేసులో ఆమె కూడా ఒక నిందితురాలు.

గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆమెకు జగన్ సముచిత స్థానం ఇచ్చారు.కీలక అధికారిగా నియమించారు. నిన్న ఐఏఎస్ అధికారుల సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఏకంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి చంద్రబాబుకు బొకే అందించారు. కానీ ఆయన స్వీకరించలేదు. సున్నితంగా తిరస్కరించారు. రిశాంత్ రెడ్డి అనే ఐపీఎస్ అధికారి గుర్తున్నారు కదా. పెద్దిరెడ్డి ఇంట్లో పనిమనిషిలా పనిచేసి చంద్రబాబుపై రాళ్లదాడితో హత్యాయత్నం చేయించేలా కుట్రపన్నారు.

అసలు పేపర్ లీక్ కాకుండానే.. లీక్ అయిందని నారాయణ స్కూల్ సిబ్బందితో స్టేట్మెంట్ రాయించుకున్నారు. ఫోన్ ట్యాప్ చేసి మరి నారాయణను అక్రమంగా అరెస్టు చేశారు. ఇప్పుడు అదే రిశాంత్ రెడ్డి నవ్వుతూ పూల బొకేతో చంద్రబాబు ఎదుట నిలబడ్డారు. కక్ష సాధింపునకు చంద్రబాబు వ్యతిరేకం అని వారి భావన. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదు అన్న విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *