తాజా వార్తలు

ప్రజలకి గుడ్ న్యూస్. ఇక అందరికీ ఉచిత విద్యుత్, ఎలా దరఖాస్తు చేయాలంటే..!

గృహజ్యోతి పథకంపై ఇంకా గందరగోళం నెలకొంది. ఇప్పటికీ కొందరికి ఈ పథకం అమలు కావడం లేదు. 200 లోపు యూనిట్లు వాడుతున్నా జీరో బిల్లులు రావడం లేదు. దీనికి సాంకేతిక సమస్యలతో పాటు అనేక కారణాలున్నాయి. దాంతో వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. అయితే గృహజ్యోతి పథకం కింద తెలంగాణలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలు గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. ఈ పరిమితి దాటితే చార్జీలు వసూలు చేస్తారు. నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువగా ఉన్నవారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.

గృహజ్యోతి పథకంలో పేద కుటుంబాలు 200 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఉచితంగా పొందవచ్చు. తెల్ల రేషన్ కార్డు, తక్కువ విద్యుత్ ను వినియోగించే కుటుంబాలు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. అయితే వీరు 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తే, అదనపు యూనిట్లకు సాధారణ విద్యుత్ బిల్లు రేటును చెల్లించాలి. ఇంటి యజమానులు కాకుండా అద్దెకు ఉంటున్న వారు సైతం ఈ స్కీమ్ కు అర్హులే. అద్దెదారులు తమ యజమాని పేరు మీద మీటర్ ఉందని నిరూపించడానికి పత్రాలను అందించాలి.

అర్హతలు.. తెలంగాణ గృహ జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేయడానికి ఈ కింద తెలిపిన అర్హతలు ఉండాలి. తెలంగాణ వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలు అనర్హులు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తుదారులు ఎటువంటి బకాయిలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు ఉండకూడదు. ఇది గృహావసరాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు తమ తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీకి ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. దరఖాస్తు చేసేవారికి ఎక్కువ ఇళ్లు ఉంటే.. వాటిలో దేనికైనా ఈ పథకాన్ని పొందవచ్చు.

దరఖాస్తు చేసే విధానం.. ప్రజాపాలన అధికారిక పోర్టల్ నుంచి గృహ జ్యోతి పథకం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.దానిలో వివరాలను పూర్తి చేయాలి, అవసరమైన పత్రాలను జత చేయాలి.
దరఖాస్తును అవసరమైన పత్రాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలి.
జతచేయాల్సిన పత్రాలు..ఆధార్ కార్డు, నివాస రుజువు, తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడీ, కరెంట్ కరెంటు బిల్లు, అద్దె, అద్దె పత్రాలు (వర్తిస్తే).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *