ఆయుర్వేదం

ఈ మొక్క ఆకులు క్రమం తప్పకుండా రోజూ 3 ఆకులు నమిలితే చాలు, షుగర్‌ వ్యాధి దెబ్బకు పరార్.

బిళ్ళ గన్నేరు అనే మొక్క జౌషధ గుణాలు ఎన్నో.. ఇన్ని మంచి గుణాలు ఉన్నా ఇది.. మధు మేహాన్ని కూడా నియంత్రిస్తుంది.. చాలా మంది దీని పేరు, ఉపయోగాలు తెలియక బ్యూటీ ప్లాంట్ పేరుతో పెంచుతున్నారు. అవును ఇంటి ముందు అందం కోసం పెంచే మొక్కల్లో ఇదొకటి. పింక్, తెలుపు వంటి అనేక రంగులలో వికసిస్తుంది. నిత్య కళ్యాణి ఆకులు, పువ్వులు శతాబ్దాలుగా సాంప్రదాయ ఔషధ చికిత్సలలో ఉపయోగించబడుతున్నాయి. ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో డయాబెటిస్‌ ఒకటి.

భారత్‌లో 20 -70 ఏళ్ల వయసు గల జనాభాలో 8.7% మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారి. ఒకసారి షుగర్ వచ్చిందంటే.. దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం తప్పితే.. నివారణ కుదరదు. క్రమం తప్పకుండా మెడిసిన్ తీసుకోవడం, స్వీట్స్ పక్కనపెట్టడం, సరైన వ్యాయామం, మంచి ఫుడ్ తీసుకోవడం వంటి వాటితో డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మన చుట్టు పక్కల ఉండే మొక్కలు డయాబెటిస్‌ను నియంత్రించడానికి సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానమైనది బిళ్ల గన్నేరు.

రక్తంలోని చక్కెరను తగ్గించడానికి, షుగర్ వాల్యూస్ కంట్రోల్‌లో ఉంచడానికి బిళ్ల గన్నేరు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. NCBI లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బిళ్ల గన్నేరు ఆకులకు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గించే కెపాసిటీ ఉంది. వివిధ దేశాల్లో బిళ్ల గన్నేరు ఆకుల రసం, టీను షుగర్‌కు ఔషధంలా వాడతారని చెబుతున్నారు. దీనిలోని హైపోగ్లైసెమిక్‌ యాక్టివిటీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెరపై బిళ్ల గన్నేరు ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోవడానికి, పరిశోధకులు తమ నివేదికలో డయాబెటిక్ కుందేళ్లపై పరిశోధన చేశారు. కుందేళ్లకు బిళ్ల గన్నేరు ఆకుల రసాన్ని ఇచ్చారు.

ఈ క్రమంలో వాటి బ్లడ్‌ షుగర్‌ లెవల్‌ 16 నుంచి 31. 9 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. బిల్ల గన్నేరులో యాంటీడయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయని పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. బిళ్ల గన్నేరు ఆకులలో ఆల్కలాయిడ్స్, టానిన్లు బాగా ఉంటాయి. ఇవి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంతో పాటు.. అనేక వ్యాధులను తరిమికొడతాయి. బిళ్ల గన్నేరు ఆకులను ఎండబెట్టి, దానిని పొడిలా చేసుకుని… రోజూ పండ్ల రసంలో ఒక టీస్పూన్ పొడిని కలుపుకొని తాగవచ్చు. లేదా ప్రతిరోజూ మూడ బిళ్ల గన్నేరు ఆకులను నమలవచ్చు. బిళ్ల గన్నేరు పువ్వులను నీటిలో వేసి మరిగించి ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *