జబర్దస్త్ కమెడియన్స్ తో రోజా మమేకం అయ్యేవారు. జడ్జి సీట్లో కూర్చుని ఆమె వేసే కౌంటర్లు, పంచులు బాగా పేలుతాయి. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ లో రోజా పాత్ర ఎంతగానో ఉంది. ఒక పక్క ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రోజా జబర్దస్త్ జడ్జిగా చేశారు. అయితే అనతి కాలంలో జబర్దస్త్ ఆదరణ తెచ్చుకుంది. ఈ షో అంటే హాస్య ప్రియులు పడిచచ్చే వారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి టాలెంటెడ్ కమెడియన్స్ వచ్చాక జబర్దస్త్ కి మరింత క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ తీసుకొచ్చారు.
రష్మీ గౌతమ్, అనసూయలతో పాటు ఎందరో సామాన్యులు జబర్దస్త్ వేదికగా స్టార్స్ అయ్యారు. జబర్దస్త్ కి రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె కమెడియన్స్ తో మమేకం అయ్యేవారు. వారి కామెడీ పంచులకు రోజా కౌంటర్లు అదిరేవి. జబర్దస్త్ సక్సెస్ లో రోజా పాత్ర ఎంతగానో ఉంది. నాగబాబు వెళ్ళిపోయినా… రోజా కొనసాగారు. అయితే ఆమెకు మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
నిబంధనల ప్రకారం మంత్రులుగా ఉన్నవారు, మరొక వృత్తిలో కొనసాగ కూడదు. జబర్దస్త్ ని వీడుతూ రోజా ఎమోషనల్ అయ్యింది. మంత్రి అయ్యాక రోజా మొత్తంగా బుల్లితెరకు దూరం అయ్యింది. కాగా 2024 ఎన్నికల్లో రోజా ఓడిపోయారు. ఈ క్రమంలో ఆమె మరలా బుల్లితెర మీద సందడి చేయడం ఖాయం అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. రోజా తిరిగి జబర్దస్త్ జడ్జిగా వస్తారని ప్రచారం జరుగుతుంది.
అధికారిక సమాచారం లేనప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. రోజా జబర్దస్త్ వీడాక పలువురు ఆ సీట్లోకి వచ్చారు. నటి ఇంద్రజ కొన్నాళ్లుగా జబర్దస్త్ షో జడ్జిగా కొనసాగుతుంది. ఆమె మానేస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. కుష్బూ కూడా జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎందరు వచ్చినా రోజా-నాగబాబు స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం జబర్దస్త్ లో స్టార్స్ లేరు. ఒకప్పటి ఆదరణ ఆ షోకి లేదు. ఒకవేళ రోజా ఎంట్రీ ఇస్తే చాలా ప్లస్ అవుతుంది. జబర్దస్త్ కి పూర్వ వైభవం రావచ్చనే మాట వినిపిస్తోంది.