ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగుతుంది. ఐఎండీ అంచనా ప్రకారం జూన్ 7న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలకు ముందస్తు వానాకాలం వచ్చింది. ఏటా జూన్ 5వ తేదీ తర్వాత చల్లబడే వాతావరణం ఈసారి ముందుగానే చల్లబడింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రోహిణి కార్తీక్ ముందే వాతావరణం చల్లబడింది. తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈదురుగాళ్లు ఉరుములు మెరుపులతో రాష్ట్రమంతా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణలోని కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 22 వరకు ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో క్యుములో నింబస్ మేఘాల కారణంగా కుండపోతవాహనులు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఏడాది తీవ్రమైన ఎండలు నమోదు అయిన నేపథ్యంలో వర్షాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయని తెలిపింది. గత నెలలో నమోదైన ఎండల కారణంగానే ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది.