ఆరోగ్యం

యాపిల్‌ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు, యాపిల్‌లోని ఈ భాగాన్ని అస్సలు తినొద్దు.

ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే.. ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి టీకా వేసుకున్నట్లే. రోజుకో యాపిల్ తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు అయిన బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాపిల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో కీలకంగా పని చేస్తుంది. యాపిల్‌లో విటమిన్లు ఏ, బి, సి, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్ వంటివి లభిస్తాయి.

అయితే సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. అందుకే వైద్యులు కూడా పండ్లను రోజూ తినాలని సలహా ఇస్తుంటారు. అయితే ప్రతి పండులోనూ శరీరానికి హాని చేసే కొన్ని లక్షణాలు, బాగాలు ఉంటాయంట. యాపిల్ విషయానికి వస్తే.. రోజుకో యాపిల్ తింటే వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెపుతుంటారు. అందుకే రోజూ యాపిల్ తినాలని.. ఇలా మీరు చేస్తే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండదని అంటుంటారు.

వైద్యులు చెప్పిన విధంగా చాలా మంది నిత్యం యాపిల్ తింటుంటారు. అయితే యాపిల్ లో ఓ భాగాన్ని అస్సలు తినకూడదంట.. ఇది తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. యాపిల్ గింజలు తినకూడదని పేర్కొన్నారు. ఈ విత్తనాలు విషపూరితమైనవని నిపుణులు అంటున్నారు. ఈ గింజల్లో అమిగ్డాలిన్ అనే పదార్ధం ఉంటుంది, దాని నుండి సైనైడ్ ఏర్పడుతుందంట.

యాపిల్ గింజలు తినకూడదని పేర్కొన్నారు. ఈ విత్తనాలు విషపూరితమైనవని నిపుణులు అంటున్నారు. ఈ గింజల్లో అమిగ్డాలిన్ అనే పదార్ధం ఉంటుంది, దాని నుండి సైనైడ్ ఏర్పడుతుందంట. పండ్లలో ఒకటి లేదా రెండు గింజలను కొరికినా ఏమీ చేయదు. కానీ ఎక్కువ విత్తనాలు తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరం. అంతే కాదు ఇవి ఎక్కవ తింటే చనిపోయే ప్రమాదం కూడా ఉందంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *