బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి బెంగుళూరు పోలీసుల అదుపులో నటి హేమ ఉన్నట్లు సమాచారం. హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశంకనిపిస్తుంది. గత నెల 20న రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో టెస్టులు జరిపితే.. నటి హేమకు పాజిటివ్ అని వచ్చింది. అయితే ఈ పార్టీలో పలువురు ఏపీకి చెందిన వారు ఉన్నారని వార్తలు వచ్చాయి.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పోలీసులు అధికారికంగా ప్రకటించినా హేమ ఆ పార్టీలో పాల్గొనలేదని బుకాయించింది. బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అందులో హేమ డ్రగ్స్ వాడినట్టు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో బెంగుళూరు పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే నటి హేమ బెంగుళూరుపోలీసులు వద్దకు విచారణకు హాజరవలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగుళూరు సిసిబి పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రేవ్ పార్టీపై వివిచారిస్తున్నట్టు సమాచారం.
మొదటి సారి నోటీసులకు అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేను అని లేఖ పంపింది హేమ. రెండవ సారి నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ రోజు బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం హేమను పోలీసులు విచారిస్తున్నారు. రేవ్ పార్టీలో తాను లేనని, బర్త్‌డే కేక్ కట్ చేసిన వెంటనే హైదరాబాద్‌కు వచ్చేశానని సినీనటి హేమ అన్నారు. విచారణకు హాజరైన హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్టు చేసి న్యాయాధికారి ముందు హాజరు పరిచారు. కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో హేమ మీడియాతో మాట్లాడారు.
ఆరోజు తాను హైదరాబాద్ నుంచే ఆ వీడియో పెట్టానని మరోసారి స్పష్టం చేశారు. మరుసటి రోజు బిరియానీ వండిన వీడియో కూడా హైదరాబాద్‌దేనని అన్నారు. పట్టుబడినట్లు చెబుతున్న రోజు ఎటువంటి టెస్ట్‌లూ చేయలేదని, పాజిటివ్ లేదని అన్నారు. ఈ రోజే శాంపిల్స్ తీసుకున్నారని ఆమె తెలిపారు. అంతకుముందు వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన సమయంలోనూ హేమ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.