పసుపు కేవలం ఔషధాల గుణాలకే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలోనూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతీ పూజలో కచ్చితంగా పసుపు ఉండాల్సిందే. ఏ శుభకార్యమైనా పసుపును కచ్చితంగా ఉపయోగిస్తారు. అంతలా జ్యోతిష్య శాస్త్రంలో పసుపు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జాతకంలో గురు దోషాన్ని తగ్గించడానికి విష్ణువుకు పసుపు సమర్పించడం శుభప్రద మని చెపుతుంటారు పండితులు. జ్యోతిషశాస్త్రం ప్రకారం పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
గురువారం నాడు గణపతికి పసుపు కొమ్ముల మాలగా వేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయంట. దీని కారణంగా మీ అన్ని పనులు సులభతరం అవుతాయంట.. దీనితో పాటు అడ్డంకులు కూడా తొలగిపోతాయని జ్యోతిష్కులు అంటున్నారు. దీనితో పాటు శ్రీ హరివిష్ణువు విగ్రహం ముందు రోజూ చిటికెడు పసుపును నైవేద్యంగా పెడితే.. ప్రేమ సమస్యలు నయం అవుతాయంట.
ప్రేమ విషయంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయని చెపుతున్నారు. మీపై చెడ్డ చూపు, లేదా చెడు కలలు వస్తే.. మీ తలపై పసుపుకొమ్ము పెట్టుకొని నిలిచిపోవాలంట. ఇలా చేయడం వల్ల చెడు కలలు రావంట. అంతే కాకుండా మీపై చెడ్డ చూపు పడినా అది తొలగిపోతుందని చెపుతున్నారు.
ఇక వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే లేదా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నట్లయితే.. గురువారం నాడు చిటికెడు పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేయాలని సూచిస్తున్నారు. దీని కారణంగా వివాహం అవుతుందని చెపుతున్నారు. అంతేకాదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా పోతుందని అంటున్నారు.