ఎంటర్టైన్మెంట్

సుశాంత్ చనిపోయిన ఇంట్లోనే నివాసముంటోన్న అదాశర్మ. ఆ ఇంట్లో ఏముందో తెలుసా..?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్..రాజ్‌పుత్ పాట్నాలో కృష్ణ కుమార్ సింగ్, ఉషా సింగ్ దంపతులకు జన్మించారు. అతని పూర్వీకుల నివాసం బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఉంది. అతని సోదరీమణులలో ఒకరు మితు సింగ్ రాష్ట్ర స్థాయి క్రికెటర్. 2002 లో అతని తల్లి మరణించారు. అదే సంవత్సరంలో రాజ్‌పుత్ కుటుంబం పాట్నా నుండి ఢిల్లీ వెళ్లింది. అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో మరణించి నాలుగు సంవత్సరాలు గడిచాయి.

ఈ ఘటన జరిగిన తర్వాత కూడా సుశాంత్ నివసించిన అపార్ట్‌మెంట్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి . ఇప్పుడు అదే ఇంటిని ప్రముఖ హీరోయిన్ అదా శర్మ కొనుగోలు చేసింది. ఇంటి కోనుగోలుకు సంబంధించిన లావాదేవీలన్నీ నాలుగు నెలల క్రితమే పూర్తయ్యాయి కానీ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో నటి ఆ ఇంటికి షిఫ్ట్ కాలేదు. ఇప్పుడు ఆ ఇంటికి మారిందీ అందాల తార. గత కొన్ని రోజులుగా అక్కడే నివసిస్తోంది అదా శర్మ.

మరి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో తన అనుభవాలను అందరితో పంచుకుందీ ముద్దుగుమ్మ. ఈ ఇల్లు కొనవద్దని కొందరు అదాకు చెప్పారట. అయితే అలాంటి వారి మాటలను ఆదా శర్మ వినలేదు. నాలుగు నె లలుగా బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లి సెటిలయ్యింది. ఇన్ని రోజులు నేను బాంద్రాలోని పాలి హిల్‌లో ఓ ఇంట్లో నివసించాను. నేను ఆ ప్రదేశం నుండి బయటకు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కొత్త ఇంట్లో పాజిటివ్ వైబ్‌ని అనుభవిస్తున్నాను’ అని చెబుతోంది అదా శర్మ.

సుశాంత్ చనిపోయిన ఈ ఇంట్లో నివాసముండడం భయం లేదా అని చాలా మంది అదాను అడిగారు. అయితే అలాంటి అనుభవాలు ఈ అందాల తారకు ఎదురుకాలేదట. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన ఇంటిని ఇప్పుడు అదా శర్మ రీడిజైన్ చేసింది. ఇంటి మొత్తాన్ని మొత్తం తెల్లగా పెయింట్ చేశారు. కింది అంతస్తును దేవాలయంగా మార్చారు. పై అంతస్తులో ఒక గది సంగీతం కోసం కేటాయిచారు. మరో గదిని డ్యాన్స్ యోగా రూమ్ గా మార్చారు. టెర్రస్ మీద గార్డెన్ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *