వందలాది మంది భక్తుల సమక్షంలో, సుబ్రమణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది. సుబ్రమణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు. అంత మంది భక్తులు ఉన్నా నెమలి అక్కడి నుంచి కదలకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన భక్తులంతా ఇది ఆ భగవంతుడి లీల అంటున్నారు. అయితే తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఓ అద్భుత సంఘటన చోటుచేసుకుంది.
ఆలయంలోని గర్భగుడి వద్ద నెమలి కనిపించింది. ఆ సుందర దృశ్యాన్నిచూసి భక్తులు పులకరించిపోయారు. ఎందుకంటే.. నెమలిని కుమార స్వామి వాహనంగా చెబుతుంటారు. ఇప్పుడు ఆ కుమార స్వామియే సుబ్రమణ్యుడు కాబట్టి ఆ నెమలే ఇక్కడకు వచ్చిందని చెప్పుకుంటున్నారు. గత వారం ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది అంతా ఆ దేవుడి మహిమే అంటున్నారు భక్తులు. వందలాది మంది భక్తుల సమక్షంలో గుడిలోకి వచ్చింది నెమలి.
సుబ్రమణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది. సుబ్రమణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు. అంత మంది జనాలు ఉన్నా.. నెమలి కదలకుండా మెదలకుండా అక్కడే అలాగే నిల్చుకుంది. పూజ పూర్తయ్యి.. హారతి ఇచ్చేంత వరకు అక్కడే నిలబడిందని అంటున్నారు స్థానికులు. ఆ సుబ్రమణ్యుడే ఈ రూపంలో వచ్చారని అంటున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులంతా సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నెమలి సందడి చేయడంపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘నెమళ్లు తరచుగా ఈ ఆలయానికి వస్తుంటాయి. అయితే ఈ సారి నెమలి గర్భగుడిలోకి వెళ్లి సుబ్రమణ్య స్వామిని పూజించడం అందరినీ ఆశ్చర్యపరిచింది, ఈ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులకు తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది’ అని పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు.. . ఇది దేవుడి మహిమకు నిలువెత్తు నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు.