Blog

ఆ పదవికి రాజీనామా చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కారణం తెలిస్తే..?

రేవంత్ రెడ్డి..గత ఏడాది సమకూరిన ఆదాయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి… జీఎస్టీ ఎగవేత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంచనా మేరకు జీఎస్టీ సాధించడంలో క్షేత్రస్థాయి పరిశీలనలు, ఆడిటింగ్‌లను పకడ్బంధీగా జరపాలన్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా.. పదికి పైగా స్థానాల్లో విజయం సాధిస్తే.. మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ వస్తారని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేయనున్నారు.

ఆ వివరాలు.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసేది సీఎం పదవికి కాదు.. టీపీసీసీ పదవికి. ప్రస్తుతం రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాక.. టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది కూడా. దాంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇక ఈ పదవి కోసం చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. టీపీసీసీ పదవి రేసులో చాలా మంది ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో.. పీసీసీ పదవిని ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక అధిష్టానం కనుక ఈసారి పీసీసీ పదవిని ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలనిభావిస్తే.. భట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. సీఎం రేసులో పోటీ పడిన భట్టి విక్రమార్క.. ఆ పదవి దక్కకపోవటంతో.. ఇటు పీసీసీ బాధ్యతలైన ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.

ఇక టీపీసీసీ పదవిని ఆశిస్తున్న వారిలో నాగర్ కర్నూల్ ఎంపీ సీటు ఆశించి భంగపడిన సంపత్ పేరు కూడా వినిపిస్తోంది. వీళ్లే కాకుండా.. బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. వీరిలో మధుయాష్కీగౌడ్.. రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి ఆయనకే ఈ పదవి వచ్చే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *