వైద్య నిపుణులు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను తొలిసారిగా గుర్తించి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటింది. అయినా ఇప్పటికీ దీనికి కచ్చితమైన చికిత్సలు అందుబాటులోకి రాలేదు. కొన్ని విధానాల ద్వారా ఇన్ఫెక్షన్ను నిరోధిస్తూ, దీని ప్రభావాన్ని తగ్గించగలిగినప్పటికీ.. వ్యాధిని నయం చేయడానికి ఎటువంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకాలు మాత్రం రాలేదు. అయితే ‘HIV వైరస్ ను అడ్డుకునేందుకు ప్రతిరోధకాలను ప్రేరేపించే సాధ్యాసాధ్యాలను చూపడంలో ఇది ప్రధాన ముందడుగు’ అని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ (DHVI) డైరెక్టర్ సీనియర్ రచయిత బార్టన్ ఎఫ్ హేన్స్ అన్నారు.
‘వైరస్ తప్పించుకోకుండా నిరోధించడానికి HIVలోని ఇతర సైట్లకు వ్యతిరేకంగా మరింత శక్తివంతమైన న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను ప్రేరేపించడం మా తదుపరి దశలు. మేము ఇక్కడే ఆగిపోలేదు. ఇప్పుడు ముందుకు వెళ్లేందుకు మార్గం చాలా స్పష్టంగా ఉంది.’ అని ఆయన అన్నారు. HIV వ్యాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్లో, 20 మంది ఆరోగ్యవంతమైన (హెచ్ఐవీ నెగెటివ్) వారిలో 15 మందికి రెండు డోసులు, ఐదుగురికి మూడు డోసులు ఇచ్చారు.
టీకా 95 శాతం సీరం ప్రతిస్పందన రేటు, రెండు మోతాదుల తర్వాత 100 శాతం CD4+ T-సెల్ స్పందన రేటుతో బలమైన రోగనిరోధకాలు ఉత్పత్తి అయినట్లు చూపించింది. ఇది విస్తృతంగా తటస్థీకరించే ప్రతిరోధకాలను కూడా ప్రేరేపించింది. ఇందులో ఒకరికి ప్రాణాంతకమైన అలెర్జీ రావడంతో అతన్ని ట్రయల్స్ నుంచి తప్పించినట్లు చెప్పారు. అయితే ఇది మరేదైన ఎఫెక్ట్ వల్ల కావచ్చని అనుకుంటున్నారు.
‘శరీరం విస్తృతంగా యాంటీబాడీ పొందేందుకు సంఘటనలు జరగాలి, ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్ తర్వాత చాలా సంవత్సరాలు పడుతుంది.’ అని ప్రధాన రచయిత విల్టన్ విలియమ్స్, Ph.D., డ్యూక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీలో అసోసియేట్ ప్రొఫెసర్, DHVI సభ్యుడు అన్నారు. ‘వ్యాక్సిన్ను ఉపయోగించి తక్కువ సమయంలో అవసరమైన సంఘటనలను పునఃసృష్టి చేయడం సవాలుగా మారింది. హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధి మంచి వార్తే అయినప్పటికీ, ఈ ఫలితాలను నిర్ధారించడం, టీకా భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు మరింత పరిశోధన జరగాలి.