ఆరోగ్యం

30ఏళ్లు దాటితే మహిళలకి ఈ అనారోగ్య సమస్యలు రావడం ఖాయం, రక్షణ కోసం ఏం చెయ్యాలంటే..?

స్త్రీల ఆరోగ్యం పురుషుల ఆరోగ్యం నుండి అనేక విశిష్ట మార్గాల్లో భిన్నంగా ఉంటుంది. మహిళల ఆరోగ్యం అనేది జనాభా ఆరోగ్యానికి ఒక ఉదాహరణ, ఇక్కడ ఆరోగ్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ “పూర్తి శారీరక, మానసిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క స్థితిగా నిర్వచించింది మరియు కేవలం వ్యాధి లేదా బలహీనత లేకపోవడం మాత్రమే కాదు”. అయితే శరీరం చురుగ్గా పనిచేయాలంటే పౌష్టిక ఆహారం తప్పనిసరి. ఇప్పుడున్న సమాజంలో అంతా ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్ వైపే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం లేదు.

పైగా సరైన సమయానికి సరైన ఆహారం తినకపోవడం వల్ల కూడా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో పాటు పలు రకాలా సాఫ్ట్ డ్రింక్స్ కూడా శరీరానికి అనారోగ్యంపాలు చేస్తున్నాయి. వాటిని తాగి కడుపు నింపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రకమైన అలవాటు ఐటీ రంగంలో పనిచేస్తున్న యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఎలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు న్యూట్రీషియన్స్. మన శరీరం అనేక రకాల విధులను నిర్వర్తించడానికి ప్రొటీన్‌ చాలా అవసరం. ఇది కండరాలు, అవయవాలు, ఎంజైమ్‌లు, హార్మోన్లు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అనేక కారణాల వల్ల శరీరానికి కావల్సిన మొత్తంలో ప్రొటీన్‌ లభించడం లేదని పరిశోధనలు చెబుతున్నాయి.

భారతీయ మార్కెట్‌ రిసెర్చ్‌ బ్యూరో నివేదిక ప్రకారం మహిళలకి రోజుకి 46 గ్రాముల ప్రొటీన్‌ అవసరం. ఇక ఈలోపం ఎక్కువగా శాకాహారుల్లో కనిపిస్తున్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ లోపాన్ని అధిగమించడానికి పలు రకాల ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా ప్రొటీన్‌ గుడ్డు, చేప, మాంసం ద్వారా లభిస్తుంది. వీటిల్లో కాల్షియం, విటమిన్‌-డి, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉండి శరీరంలో పల్చని కండరాలను వృద్ధి చేస్తాయి. రోజూ గ్లాసు ఆవుపాలు తాగడంవల్ల 8గ్రా. ప్రొటీన్‌ అందుతుంది.

దీంతోపాటు పెరుగు, పనీర్‌ తీసుకున్నా కూడా ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. శాకాహారులు తమ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే సరి. బాదం, జీడిపప్పు, వేరుశనగ వంటివి ఉప్పు లేకుండా చిరుతిండిగా తీసుకుంటే మేలు. లేదా ఓట్‌మీల్‌లో చియాగింజలను కలిపి తీసుకున్నా మంచిదే. వీటితోపాటు బచ్చలికూర, పచ్చిబఠాణీ, చిక్కుళ్లు, మొలకల్లోనూ ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *